తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారమే థ్యేయంగా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. పట్టణంలోని 20వ వార్డు నుంచి రెండవ రోజు పర్యటన ప్రారంభించారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, యువత నుంచి విశేష స్పందన వస్తోంది.
పట్టణంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు హైదరాబాద్ రోడ్డులోని జిపిఆర్ గార్డెన్స్ సమీపంలో జిల్లా కలెక్టర్ పౌసమి బసుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.