తాండూరు: ఈ నెల 25వ తేదీన యాలాల మండల సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ పుష్పలీల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ బాలేశ్వర్ గుప్త అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందన్నారు. మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆమె పేర్కొన్నారు.