యాలాల: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎంఈఓ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పదవ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పలు కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇది మంచి అవకాశమని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం యాలాల బాలుర ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌ను 8328379942 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు.