తాండూరు: తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన పలువురు ప్రజలతో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమావేశం అయ్యారు. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సహకారంతో ప్రతీ గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.