తాండూరు: చెట్లతో మానవ మనుగడ ముడిపడి ఉందని ఎస్పీ నారాయణ అన్నారు. మల్కాపూర్ గ్రామ శివారులో ఉన్న ఐసీఎల్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ నారాయణ మాట్లాడుతూ.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. లాక్ డౌన్ సమయంలో ఫ్యాక్టరీలు మూసేయడంతో కాలుష్యం చాలా వరకు తగ్గిందని ఎస్పీ నారాయణ తెలిపారు. ప్రతీ జీవికి అమసరమైన ఆక్సిజన్ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.