తాండూరు: యాలాల మండలంలోని రాస్నం గ్రామ శివాలయంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నూతన ధ్వజస్తంభ ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శివాలయంలో గత మూడు రోజులుగా గణపతి, ఆంజనేయుడు, శివలింగం, పార్వతీపరమేశ్వరులు, వీరభద్ర, నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం ధ్వజస్తంభ ఏర్పాటుతో కార్యక్రమాలు పూర్తయ్యాయి.