పెద్దేముల్: కరోనా భారి నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని డీఎంహెచ్ఓ సుధాకర్ షిండే అన్నారు. పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల పట్ల నిబద్ధతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రస్తుతం సురక్షింతగా ఉంటున్నట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ తెలిపారు. కరోనా మహమ్మారి నియంత్రణకు టీకాలే మార్గమని, త్వరలో మొదటి డోస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. వాక్సిన్ తీసుకున్నవారు సైతం ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాక్సిన్తో రోగనిరోధక శక్తి పెరిగి కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్ధ్యం లభిస్తుందని తెలియజేశారు.