తాండూరు: మండలంలోని పర్వతాపూర్, చింతమనిపట్నం గ్రామాల్లో నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్బంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వం అండతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.