తాండూరు: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఆయన దళితబంధు పంపిణీ చేశారు. పెద్దేముల్, యాలాల్ మండలాలకు చెందిన ముగ్గురికి రెండు కార్లు, ట్రాక్టర్ అందజేశారు.