తాండూరు: తాండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాండూరు పట్టణానికి చెందిన సీనియర్ నేత ఎస్.రాజుగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని రాజుగౌడ్ కు సూచించారు. ఆయనతో పాటు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన శకుంతలను పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం కన్వీనర్ గా నియమిస్తూ ఎమ్మెల్యే ఆమెకు నియామకపత్రం అందజేశారు.