తాండూరు: తాండూరు పట్టణంలో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ కాలనీలో పట్టణ ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అంతర్గత రోడ్లు, మురుగు కాలువలను పరిశీలించారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ రోడ్లపై చెత్తలేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు.