తాండూరు: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యాలాల మండలం బషీర్మియాతాండకు చెందిన గోవింద్ కు రూ.82,500 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ సకాలంలో చెక్కులు అందేలా చూస్తామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెల్లడించారు.