తాండూరు: దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం దళితబంధు అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అడ్కిచెర్ల గ్రామానికి చెందిన రేవంత్ కు దళితబంధు ద్వారా మంజూరైన గూడ్స్ ఆటో, పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అర్జున్ కి మంజూరైన కారును అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.