తాండూరు: తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం, సీడీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా రేణుక ఎల్లమ్మ తల్లి విశేష పూజలు అందుకుంటుందన్నారు. తాండూరు నియోజకవర్గం నుంచే కాకుండా కర్ణాటక నుంచి సైతం ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం భక్తులు వస్తుంటారని చెప్పారు.