బషీరాబాద్: బషీరాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కంసాన్ పల్లి, మర్పల్లిలో సైడ్ డ్రెయిన్లు, నవల్గా గ్రామంలో సీసీ రోడ్లు, పర్వత్ పల్లిలో ఫార్మేషన్ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి పల్లె అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. మన ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ ను యువత సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.