తాండూరు: నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు. కాలుష్య రహిత తాండూరు లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాల పాటు కరోనా కారణంగా అభివృద్ధి కుంటుపడిందని, మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.