తాండూరు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపధ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రంలో వేలమంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు.
హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ల అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ప్రజాబంధు నిర్వాహకులు అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. వేల మంది అభ్యర్థులు శిక్షణ కోసం వస్తున్న నేపథ్యంలో పట్టణ పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
నిరుద్యోగ యువత కోసం గతంలో ఎవరూ ఈ స్థాయిలో కృషి చేయలేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీసుకున్న ఉచిత శిక్షణ నిర్ణయం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం చేస్తున్నారు.