తాండూరు: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం దిశగా ముందుకు సాగాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపానర్సింలు సూచించారు. పట్టంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ అందజేశారు. నియోజకవర్గంలో పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ ఎగ్జామినేషన్ ప్యాడ్, పెన్ను, పెన్సిల్ తదితర వస్తువులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన సొంత ఖర్చులతో అందిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు 10 పాయింట్లు సాధించి పాఠశాలకు, నియోజకవర్గానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.