తాండూరు: రాష్ట్రంలో యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి రైతుల పక్షాన నిలిచి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్పారు. ధాన్యాన్ని ఎవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని రూ.1960 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటన చేయడం రైతు సోదరులకు ఊరటనిచ్చే పరిణామమన్నారు. అన్నదాతల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.