తాండూరు: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని యాలాల మండలం జుంటుపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో అన్ని ఆలయాలకు పాలకవర్గాలను నియమించినట్లు తెలిపారు.