తాండూరు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్దేముల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, గాజీపూర్ సర్పంచ్ వీరన్న ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఘాజీపూర్ గ్రామ అభివృద్ధిలో భాగంగా ఫార్మేషన్ రోడ్డు కోసం రూ.5 లక్షలు మంజూరు చేయించినందుకు గాను సర్పంచ్ వీరన్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.