తాండూరు: బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అన్నారు. తాండూరు పట్టణంలో దళిత యువజన సంఘం అధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడిన బాబూ జగ్జీవన్ రామ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తాండూరు పట్టణంలో ఆయన విగ్రహంతో పాటు హాల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. తాండూరు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ దీపానర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు.