తాండూరు: చెంగోల్ నుంచి హైదరాబాద్ రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని కాంట్రాక్టర్లకు సూచించారు.