తాండూరు: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.