తాండూరు: తాండూరు పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో తాండూరు స్టోన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు.