తాండూరు: తమను తిరిగి విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆరాధ్య దైవం అని తాండూరు నియోజకవర్గం పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు అన్నారు. ఆదివారం వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదినిని కలిసి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న స్వరాష్ట్ర లక్ష్యం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సంపూర్ణమైనట్లు పేర్కొన్నారు.