బషీరాబాద్: బషీరాబాద్ మండలం బాద్లాపూర్ తాండలో తాగునీటి ఎద్దడికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరిష్కారం చూపారని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి తాండలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీంతో గ్రామస్తులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి నూతనంగా బోరు వేయించి సమస్యను పరిష్కరించారని చెప్పారు. తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.