తాండూరు: తాండూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలను ఘనంగా సత్కరించారు. తాండూరు పట్టణంలోని ఎంపీటీహాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఏమ్ లు, వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మహిళలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో సభలో సందడి వాతావరణం నెలకొంది.