తాండూరు: ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సూచించారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నారులకు చుక్కల మందు వేయించడంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఎవరికైనా ఆదివారం చుక్కలు వేయించడం కుదరకపోతే ఆశా వర్కర్లను సంప్రదిస్తే చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు.