తాండూరు: వీరశైవ సమాజ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం వీరశైవ సమాజ ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరశైవ సమాజం రుద్రభూమిలో రూ.10 లక్షలతో రోడ్ల నిర్మాణం, చేరువెంటి ఈశ్వరాలయానికి మరో రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.