తాండూరు: ఛత్రపతి శివాజీ 392వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపానర్సింలు ఆవిష్కరించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఏకతాటిపై నిలిపిన హిందూ ధర్మ రక్షకుడు శివాజీ అని, యవత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.