తాండూరు: మండల పరిధిలోని బొంకూర్ బిజ్వార్ గ్రామంలో ఈ నెల 14న మల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.