తాండూరు: పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన లాలయ్యకు రూ.1లక్ష విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన లాలయ్య తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడికి అందజేశారు. నడవలేని స్థితిలో ఆటోలో కూర్చున్న లాలయ్య వద్దకు ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి చెక్కును అందజేశారు.
జై రోహిత్ అన్న…✊✊