తాండూరు: టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనంద్ నేతృత్వంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టం అవుతుందని ఆయన అన్నారు. పార్టీ పటిష్టతకు తీసుకునే నిర్ణయాల్లో సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెల్లడించారు.