తాండూరు మండలం మిట్టబాస్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఉప సర్పంచ్ నరహరి, పెంటయ్య గౌడ్, మహేందర్ పటేల్ తో పాటు మరికొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అధికార పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం గ్రామంలో బాబూ జగ్జీవన్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు