ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిధిలోని కొవలి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరితో కలిసి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అన్నారు. తెలుగు ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సంక్రాంతి వేడుకలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.