తాండూరు: పట్టణంలోని ఇందిరాచౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు గల రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రజల అవసరాల కోసమే రోడ్డు విస్తరణ చేపడుతున్నామని.. భవన యజమానులు, దుకాణదారులు సహకరించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరారు. అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి రైల్వే స్టేషన్ నుంచి ఇందిరాచౌక్ వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. రోడ్డు విస్తరణ పనులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.