పెద్దేముల్: రైతుబంధు సంబరాల్లో భాగంగా పెద్దేముల్ మండలం గొట్లపల్లి మోడల్ స్కూల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధుతో పాటు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.