బషీరాబాద్: మండలంలోని ఇదర్చెడ్ గ్రామంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పాఠశాల భవనానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మరో రూ.40 లక్షలతో గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.