తాండూరు: తాండూరు పట్టణం సీతారాంపేట్ హనుమాన్ దేవాలయం కమిటీ సభ్యులు శుక్రవారం దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చైర్మన్ గాజుల కమలాకర్, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.