తాండూరు: తాండూరు మండలం చెంగేస్పూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఎంపీటీసీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 5లో ఉన్న పేదల ప్లాట్లను కొంతమంది కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎమ్మెల్యేను కోరారు