పెద్దేముల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దేముల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
రుక్మాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ రూ.16వేలు, జనగాం గ్రామానికి చెందిన శివలక్ష్మి రూ.38వేలు విలువ చేసే చెక్కులను శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.