యాలాల మండలం ముద్దాయిపేటలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ జాతరలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచం అంతా కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.
అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.