యాలాల మండలం ముద్దాయిపేట గ్రామంలో ఈ నెల 31 నుంచి నిర్వహించనున్న రేణుక ఎల్లమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 31న ప్రారంభం అయ్యే ఉత్సవాలు ఆదివారం నిర్వహించే రథోత్సవంతో ముగుస్తాయని తెలిపారు. భక్తులు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారి జాతరలో పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.