తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు పెద్ద ఎత్తున చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు చర్చిల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.