తాండూరు: తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మేరకు శనివారం తాండూరు మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించారు.
రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలను పరిశీలించిన అధికారులు కొలతలు తీసుకున్నారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.