తాండూరు పట్టణంలో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఈ మేరకు పట్టణంలోని ఖన్జాపూర్ గేట్ సమీపంలో శుక్రవారం ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.