యాలాల: రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరిన వారికి ఎన్నో లాభాలు ఉంటాయని యాలాల రైతు ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాబార్డు ప్రత్యేక కార్యదర్శి నర్సింహులు పేర్కొన్నారు. యాలాల మండలం రాఘవపూర్‌లో వారు రైతులతో మాట్లాడుతూ.. నాబార్డు ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు చేశామని.. సంఘం ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో సభ్యత్వం తీసుకున్న వారికి నాబార్డు అందించే రుణాలు, సబ్సిడీ పథకాలకు అర్హులని వారు పేర్కొన్నారు.