ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలైన ఘటన బషీరాబాద్ సమీపంలో బుధవారం జరిగింది. మండలంలోని మంతన్గౌడ్ తండాకు చెందిన రమేష్ రాథోడ్, అతడి కుమారుడు శ్రీను ద్విచక్రవాహనంపై తాండూరు నుంచి బషీరాబాద్ వెళ్తున్నారు. ఎక్మాయి గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్, మంగళి బసప్ప బైక్పై తాండూరు వెళ్తుండగా గ్రామ శివారులోని మలుపు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రమేశ్ రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందగా అతడి కుమారుడు శ్రీను, శ్రీకాంత్, బసప్ప తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తాండూరు జిల్లా అస్పత్రికి తరలించారు.