ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన సమ్రీన్ కుటుంబ సభ్యులకు బుధవారం రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.